BDK: కొత్తగూడెం INTUC కాంట్రాక్టు కార్మికుల కార్పొరేట్ ఏరియా ఇన్‌ఛార్జ్‌గా జి. సందీప్ కుమార్‌ను నియమించారు. INTUC రీజినల్ ఇన్‌ఛార్జ్. కె. ఆల్బర్ట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కనుకుంట్ల కుమార్, చేతుల మీదగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలోనే కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలిచిన ఏకైక జెండా INTUC అని కొనియాడారు.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) నుంచి మహారాష్ట్రలోని పౌరాగడ్ వరకు శుక్రవారం సేవాలాల్ దీక్షాపరుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లనున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు.
PDPL: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం పెద్దపల్లి జిల్లాలో రానున్న రెండు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 41–61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
RR: తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఉగాది పర్వదినం సందర్భంగా నిన్న సాయంత్రం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తుల విన్నపం మేరకు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
GDWL: గద్వాల పట్టణం జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు ప్రత్యేక పూజల సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని పులకించిపోయారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
HNK: భీమదేవరపల్లి (M) కొత్తకొండ వీరభద్ర స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయాన్ని భక్తులు సందర్శించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
HYDలో పలు చోట్ల జిమ్‌లలో శరీర కండల పెంపు కోసం ప్రమాదకరమైన సూదులు వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మెఫెంటెర్మైన్ సల్ఫేట్ వంటి హానికర పదార్థాలు వాడుతున్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం కావడంతో యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
VKB: తాండూరులోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఏప్రిల్ 11న స్వామివారి రథోత్సవం, 12న లంకాదహనం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి రెండు కుటుంబాలకు సంబంధించిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స కోసం LOCలను అందజేశారు. వనపర్తి పట్టణం నందిమల్ల గడ్డకు చెందిన వెంకటమ్మకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వపరమైన రూ. 4 లక్షల LOC ని మంజూరు చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
NLG: నాగార్జునసాగర్ జలాశయం తాజా చేపల వంటకాలకు పెట్టింది పేరు. ఇక్కడ దొరికే చేపలతో చేసే స్పెషల్ ఫ్రై రుచికి స్థానికులతో పాటు వేల మందికి పైగా హాయిగా రోజు వచ్చే పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ప్రత్యేక మసాలాలతో వేయించిన ఈ చేపలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. సాగర్ రోడ్డు వెంట ఉన్న సుమారు 10 హోటళ్లు, స్టాళ్లలో తాజాగా పట్టిన చేపలను విక్రయిస్తారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ, విక్రయ సంతను ఇవాళ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల వ్యాపారులకు ఒకే చోట సౌకర్యవంతంగా కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే విధంగా ఈ సంత ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
VKB: కొడంగల్ పట్టణంలో ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుంచే పోలీసులు ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రహదారులను బారికేడ్లతో కట్టివేసి, ప్రతి వ్యక్తి వివరాలు అడిగి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.
VKB: కొడంగల్ పట్టణంలో ఆశా కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించమని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నుంచే పోలీసులు ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రహదారులను బారికేడ్లతో కట్టివేసి, ప్రతి వ్యక్తి వివరాలు అడిగి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు.
SRD: హత్నూర మండలం కాసాల గ్రామంలో పాముకాటుకు గురై ముసునూరి సింధూజ (17) అనే బాలిక మృతి చెందింది. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లి వచ్చేసరికి బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.