కామారెడ్డి: బిక్కనూర్ రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరుగుతున్న రైతు ఉత్సవాలకు తరలివెళ్లారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో రైతులు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని, ప్రదర్శన స్టాళ్లను రైతులు పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు హాజరవుతారని ఏఓ తెలిపారు.
SRCL: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఏబీవీపీ సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లోపల్లి రాజు అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. రూ 3,24,234 కోట్ల బడ్జెట్ విద్యారంగానికి కేవలం రూ.26,674 కోట్లను కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తామన్నారు.
NGKL: తెలంగాణలోని నల్లమల అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ చర్యలు ఫలిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2024-25 నాటికి 36కు చేరింది. ఆధునిక రేడియో ఫ్రీక్వెన్సీ కెమెరాలతో నిఘా పెంచడం వల్ల వేట తగ్గుముఖం పట్టింది. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలు పర్యావరణ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
HYD: బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెకోపోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి ఆదేశించింది. భూసేకరణ చట్టం సెక్షన్ 21 కింద నోటీసులు ఇచ్చే వరకు తదుపరి చర్యలు ఉండవని, పిటిషనర్ల ఆస్తులపై స్టే వర్తిస్తుందని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ను 2 పత్రికల్లో, ఒకటి స్థానిక భాషలో ప్రచురించాలని సూచించింది.
KNR: ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. తిరుపతిరావు తెలిపారు. గూగుల్ పే కంపెనీలో 40 సేల్స్ ఎగ్జిక్యుటివ్ ఉద్యోగాలు ఉన్నాయని, 20-40లోపు వయసు ఉండి ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. ఎంపికైనా వారికి రూ.18 వేలు వేతనం అందుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9032303848, 7207659969కు సంప్రదించాలన్నారు.
PDPL: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంలోని నలుగురు అధికార ప్రతినిధుల్లో మంథనికి చెందిన సెగ్గెం రాజేష్‌కు చోటు దక్కింది. రాజేష్ గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా, మంథని మండల అధ్యక్షుడిగా, ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తానని రాజేష్ తెలిపారు.
ADB: గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 425 1939 సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారం ఆధారంగానే స్పందిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
BHNG: 2006-2007 పదో తరగతి మోత్కూర్ పూర్వ విద్యార్థులు కలిసి మమ్మద్ బిపాషా భర్త రహీం అకాల మృతి చెందడంతో స్నేహితులు అందరూ కలిసి 40 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. తమతోపాటు బాల్యం నుంచి విద్యాభ్యాసం చేసిన స్నేహితురాలు భర్తను కోల్పోవడంతో స్నేహితులు ఆమె ఫ్యామిలీని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
JGL: జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో మామిడి పంట ఒకటి. జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో మామిడి తోటల సాగు విస్తీర్ణం ఉండగా, సాధారణంగా ఎకరాకు 5–10 టన్నుల వరకు మామిడి దిగుబడి వస్తుంది. కానీ ఈసారి అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తెగుళ్లు పెరిగి మామిడి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ఫలితంగా ఈసారి మామిడి పూత, పిందలు, కాయలు రాలడంతో దిగుబడి తగ్గనుంది.
BHNG: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ఆత్మీయభారతి సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్‌ను ఘన సన్మానించారు. రామన్నపేట మండలం వెల్లంకిలోని ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో పాల్గొని తన కవితను వినిపించి నిర్వహకులచే ప్రశంసలను పొందారు. ఈ సందర్భంగా పలువురు కవులు అభినందనలు తెలిపారు.
వనపర్తి పట్టణం 12వ వార్డు రాజునగరంలోని చెరువు అలుగుల పునరుద్ధరణ వేగవంతంగా పూర్తవాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా చెరువులోని మురికి నీరును పోకుండా తగిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యను విన్నవించిన ఎవరు పట్టించుకోలేదని నేడు ఆయన పునరుద్ధరించడం హర్షించదగ్గ విషయమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
NZB: స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడిచినా వడ్డెరల సమస్యలు పరిష్కారం కాలేదని వడ్డెర వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు ఇడ్డగొట్టి సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ప్రస్తుత బడ్జెట్లో వడ్డెరల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే కృషి చేయాలన్నారు.
ADB: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, ఈ మేరకు ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, ఏజెన్సీలో ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరసన చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
BDK: పినపాక మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణీ కారం జయశ్రీకి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జానంపేట పీహెచ్‌సీకి తరలించి 108కి సమాచారం అందించారు. మెరుగైన చికిత్స కోసం సిబ్బంది ఆమెను మణుగూరు తరలిస్తుండగా సీతారామపురం సమీపంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే సిబ్బంది ప్రసవం చేశారు.
MLG: ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన ఏటూరునాగారం ITDA కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. ఫిర్యాదుకు అందించేందుకు ఏటూరునాగారం ITDA కార్యాలాయానికి రావాలని సూచించారు.