• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యువత వ్యాయామంపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

WNP: పట్టణంలోని కొత్తకోట రోడ్డులో జగత్పల్లి గ్రామానికి చెందిన యువకుడు గణేష్ ఆధునాతన సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గోల్డెన్ జిమ్’ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని, యువకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు ప్రతిరోజు ఉదయం జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఎమ్మెల్యే సూచించారు.

April 6, 2026 / 05:20 PM IST

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా తొట్టి పంపు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అలాగే పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ప్రజా ప్రభుత్వంలో పేదవాని సొంత ఇంటి కల సహకారం అవుతుందని ఆయన తెలిపారు.

April 6, 2026 / 05:20 PM IST

ఆదిలాబాద్‌కు ఎంత చేసిన తక్కువే: CM

ADB: ఆదిలాబాద్‌కు ఎంత అభివృద్ధి చేసిన తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో ఆడపడుచులకు ఇచ్చిన చీరలు ఉపయోగకరంగా ఉండేవి కావన్నారు. ప్రజా పాలనలో ఆడపడుచులకు ఇచ్చిన చీరలు పాలపిట్ట రంగులో ముస్తాబుగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా నాయకులు తనకు విన్నవించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

April 6, 2026 / 05:20 PM IST

సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ నిఘా నీడలో భద్రత కొనసాగుతోంది. 2023లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల నేపథ్యంలో కేంద్రం ఈ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ప్రధాన డ్యాం మొత్తం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉంది. డ్యాం పరిసరాల్లో నిరంతరం పహారా కాస్తూ, కేవలం అనుమతి ఉన్న అధికారులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

April 6, 2026 / 05:20 PM IST

అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీతో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షల చేయించుకోవాలని సూచించారు.

April 6, 2026 / 05:18 PM IST

‘వారు రాజకీయ ప్రత్యర్థులే కానీ.. శత్రువులు కారు’

ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిత్రులు ఎంపీ, ఎమ్మెల్యేలు నగేష్, పాయల్ శంకర్, అనిల్ జాధవ్ తమకు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు కానీ, ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ, భేదాభిప్రాయాలు కావన్నారు. అభివృద్ధియే లక్ష్యంగా కలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

April 6, 2026 / 05:17 PM IST

బీజేపీ ఆవిర్భావ: కొబ్బరి బోండాపై కమలం చిత్రం

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ బీజేపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కొబ్బరి బోండాపై కమలం చిత్రం వేసి ఆకట్టుకున్నాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీకి ప్రజలలో ఎనలేని గుర్తింపు లభించిందని చిత్రం ద్వారా పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్ ప్రతిభను కొనియాడారు.

April 6, 2026 / 05:15 PM IST

‘కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమించాలి’

MHBD: కార్మిక ఉద్యమ నేత బీటీ రణదీవే స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం బీటీ రణదీవే 36వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని బీటీ రణదీవే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు.

April 6, 2026 / 05:15 PM IST

విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం క్యాంప్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిట్యాల, నార్కెట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా, పెండింగ్ సమస్యలపై చర్చించారు. వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు.

April 6, 2026 / 05:10 PM IST

R&B గెస్ట్‌ హౌస్‌ను సందర్శించిన కలెక్టర్

ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.హరిత కాగజ్ నగర్‌లోని ఆర్‌ అండ్ బీ (R&B) అతిథి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 05:10 PM IST

ప్రజావాణిలో 150 వినతులు స్వీకరించిన కలెక్టర్

వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రజల నుండి 150 వినతిపత్రాలను స్వీకరించారు. రెవెన్యూ 58, జీడబ్ల్యూఎంసీ 27, ఇతర శాఖలకు 65 దరఖాస్తులు అందినట్లు ఆమె తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూమ్ ద్వారా తహసీల్దార్లతో సమన్వయం చేసి వినతులను పరిశీలించారు.

April 6, 2026 / 05:08 PM IST

భానుడి భగభగ.. అల్లాడుతున్న ప్రజలు !

VKB: పరిగి నియోజకవర్గంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం పరిగిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

April 6, 2026 / 05:03 PM IST

‘పిల్లలను ప్రభుత్వ బడిలోకే పంపించాలి’

NZB: వేల్పూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల రామన్నపేట ఆధ్వర్యంలో ఈరోజు ముందస్తు బడిబాట కార్యక్రమిం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ సునీత గ్రామంలో ఉన్న విద్యార్థులందరీని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరరు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు కే. శివాజీ , కే.నరేందర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 6, 2026 / 05:03 PM IST

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

GDWL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి 103 అర్జీలను స్వీకరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించాలని, వేసవిలో త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ వసతిగృహాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

April 6, 2026 / 05:01 PM IST

కామ్రేడ్ బీటీ రణదివే వర్ధంతిని నిర్వహించిన CITU

SRD: CITU వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ బీటీ రణదివే వర్ధంతిని సోమవారం తోషిబా పరిశ్రమ CITU యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రమంలో రణదివేకి నివాళులు అర్పించినట్లు యూనియన్ నాయకుడు కే. రాజయ్య తెలిపారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మిక శక్తులను, కార్మిక సంఘాలను ఏకం చేసి CITUను స్థాపించిన మహామేధావి రణదీవే అని అన్నారు.

April 6, 2026 / 05:01 PM IST