• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు శ్రీరంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయంలో నేడు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. శుక్రవారం రేవతి నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరుగుతుందని అర్చకులు చెప్పారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు.

March 20, 2026 / 07:01 AM IST

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై ఎస్పీ హెచ్చరిక

NRPT: సోషల్ మీడియాలో మతాలను, వ్యక్తులను కించపరిచేలా, లేదా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ముఖ్య సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికల్లో అనుచిత పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

March 20, 2026 / 07:01 AM IST

హనుమాన్ ఆలయానికి ఎల్‌ఈడీ, రూప్ లైట్ల వితరణ

NZB: సాలురా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. స్థానిక ఒంటి హనుమాన్ ఆలయానికి ఎల్‌ఈడీ, రూప్ లైట్లను అందజేసి, ఆలయ ప్రాంగణం ప్రకాశవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు విద్యార్థుల చొరవను అభినందించారు. సమాజ సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.

March 20, 2026 / 06:56 AM IST

ట్రైనీ కలెక్టర్ రవితేజకు సన్మానం

NRPT: గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన ట్రైనీ కలెక్టర్ బొర్ర రవితేజను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఉగాది సందర్భంగా స్వగ్రామానికి రాగా, బాలుర హాస్టల్ వార్డెన్ యాదయ్య విద్యార్థులతో కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఏకే స్పోర్ట్స్ ఫౌండర్ అంజి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 06:55 AM IST

ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

MBNR: తెలంగాణ శాసనసభ పక్ష విప్‌గా నియమితులైన మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు గుండా మనోహర్, మున్నూరు రవి, చింతకింది శ్రీనివాసులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

March 20, 2026 / 06:50 AM IST

జిల్లా కాంగ్రెస్ కమిటీలో రామాయంపేటకు మూడు పదవులు

MDK: జిల్లా కాంగ్రెస్ కమిటీలో రామాయంపేట మున్సిపాలిటీకి మూడు పదవులు దక్కాయి. రామాయంపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల యాదగిరిలకు జిల్లా ఉపాధ్యక్షుల పదవులు దక్కాయి. జిల్లా కార్యదర్శిగా పోచమ్మల గణేష్‌ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నర

March 20, 2026 / 06:48 AM IST

నేడు బడ్జెట్ పైనే ఆసరా ఆశలు .. పెన్షన్ పెరుగుతుందా ?

NLG: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4,79,448 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పెన్షన్ల పెంపుపై నేడు స్వస్థత వస్తుందని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పెంచితే NLG- 2,15,972 మంది, SRPT- 1,56,077 మందికి లబ్ధి కలగనుంది.

March 20, 2026 / 06:46 AM IST

డీసీసీ ఉపాధ్యక్షుడుగా హరినారాయణ గౌడ్

MBNR: అమ్రాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత హరినారాయణ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని హరినారాయణ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు ధన్యవాదములు తెలిపారు.

March 20, 2026 / 06:44 AM IST

గ్యాస్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

GDL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు నూతన నిబంధనలను అమలు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.

March 20, 2026 / 06:43 AM IST

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

SRD: జహీరాబాద్ పట్టణం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పంచాంగ శ్రవణం జరిగింది. సంఘం అధ్యక్షులు గడ్డం జనార్దన్ పూజ కార్యక్రమం చేయగా స్థానిక పండితులు వేణు పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాశుల వారీగా ఆదాయ వ్యయాలను వివరిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. సంవత్సర ఆరంభంలో ధరల పెరుగుదల ఉన్నప్పటికీ మధ్య కాలంలో ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు.

March 20, 2026 / 06:43 AM IST

చెన్నారంలో ఘనంగా బండలాగుడు పోటీలు

WNP: ఉగాది పండుగ సందర్భంగా చెన్నారం మండలంలో బండలాగుడు పోటీలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న పోటీదారులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, నూతన వార్డు సభ్యులు ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.

March 20, 2026 / 06:41 AM IST

పవిత్ర రంజన్ మాసం మతసామరస్యానికి ప్రతీక: ఎమ్మెల్యే

HYD: పవిత్ర రంజన్ మాసం మతసామరస్యానికి ప్రతీక అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కార్ఖానా, మహాత్మానగర్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ముస్లింలకు రంజన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.

March 20, 2026 / 06:35 AM IST

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: రంజాన్ మాసం చివరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ చుట్టూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయి. మదీనా, హిమ్మతురా, చౌక్ మైదాన్, ఏతబార్ చౌక్ తదితర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.

March 20, 2026 / 06:32 AM IST

ఫైనల్ కుస్తీలో సమ ఉజ్జీలు.. ఇద్దరికీ బహుమతులు

SRD: సిర్గాపూర్‌లో ఉగాది పండుగ పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలు రసవత్తరంగా జరిగాయి. అయితే పైల్వాన్లు హోరాహోరిగా తలపడ్డారు. దాదాపు గంటకు పైగా కుస్తీ కొనసాగింది. పొద్దు మునిగి చీకటి పడగానే సర్పంచ్, పెద్దలు ఫైనల్ పోటీ డ్రా గా ముగించారు. శరత్ పవార్, సిద్దేశ్వర పైల్వాన్లకు సమ ఉజ్జీలుగా ప్రకటించి బహుమతులు ఇచ్చారు.

March 20, 2026 / 06:32 AM IST

వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

KMR: మహమ్మద్‌నగర్ మండలం బుర్గల్ గ్రామంలో ఓ మహిళ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడబోతుండగా.. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ట్యాంకర్ పైకి ఎక్కి ఆమెతో మాట్లాడి కిందకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది.  స్రవంతి అనే యువతి కుటుంబ విభేదాల నేపథ్యంలో గ్రామంలోని 60 అడుగుల ఎత్తున నీటి ట్యాంకర్ పైకి ఎక్కింది.

March 20, 2026 / 06:30 AM IST