NZB: సాలురా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. స్థానిక ఒంటి హనుమాన్ ఆలయానికి ఎల్ఈడీ, రూప్ లైట్లను అందజేసి, ఆలయ ప్రాంగణం ప్రకాశవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ నిర్వాహకులు విద్యార్థుల చొరవను అభినందించారు. సమాజ సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.