నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీతో కలిసి ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షల చేయించుకోవాలని సూచించారు.