ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ జరుపుకుంటాం. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాపించబడిన జ్ఞాపకార్థం ఈ రోజును కేటాయించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందరికీ అందేలా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ప్రతిఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.