HNK: బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో తూల్ల రవి దళిత రత్న అవార్డును అందుకున్నారు. ఈ మేరకు నేడు ఆయనను హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందించారు. దళిత హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దళితుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.