SDPT: వర్గల్ మండలం నాచారం గ్రామ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పర్స యాదగిరి, 41వ బూత్ అధ్యక్షుడిగా ఈసూరి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు ఈసూరి యాదగిరి, మండల ఉపాధ్యక్షులు బండ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.