• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొత్తగూడ జీపీ కార్యదర్శిగా దివాకర్

MHBD: కొత్తగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఆడుప దివాకర్ ఇటీవల నియామకం రాగా.. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో కురవి మండలంలో పనిచేసిన దివాకర్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన జీపీ కార్యదర్శి కే.సుమన్, డోర్నకల్ మండలం దుబ్బతండాకు బదిలీ అయ్యారు.

April 5, 2026 / 12:23 PM IST

మాజీ ఉప ప్రధాని సేవలు మరువలేనివి

KMR: దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావ్ సేవలు మరువలేనివని, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో, జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు ఉన్నారు.

April 5, 2026 / 12:19 PM IST

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’తో పటిష్ట నిఘా

SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలను CCTV నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నారు. ఈ మార్చిలో జిల్లా వ్యాప్తంగా 350కి పైగా కెమెరాలను ఏర్పాటు చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రతి గ్రామం ఒక రక్షణ కవచంలా మారాలని, ప్రజలు పోలీసులతో భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు.

April 5, 2026 / 12:14 PM IST

అంకితభావంతో పని చేయాలి: కలెక్టర్

VKB: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. హర్ష చౌదరి తన శిక్షణ కాలంలో ఎంతో వినయంతో మెలిగి అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై పట్టు సాధించారని ప్రశంసించారు.

April 5, 2026 / 12:08 PM IST

ఈస్టర్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్ మండలం కనకమామిడి గేట్ సమీపంలోని ప్రార్థన కొండ చర్చిలో నిర్వహించిన ఈస్టర్ పండుగ వేడుకలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

April 5, 2026 / 12:07 PM IST

మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జుతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వచ్చారు. అలాగే విపక్ష నాయకులు కూడా వారి కౌన్సిలర్లతో వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

April 5, 2026 / 12:05 PM IST

మహబూబ్‌నగర్‌లో ఇంటి వద్దకే ఎఫ్.ఐ.ఆర్ సేవలు

MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే, తమ ఇంటి నుండే ఫిర్యాదు చేసేలా “హోమ్ ఎఫ్.ఐ.ఆర్” విధానాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం పోలీసులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తారు. తక్షణమే ఫిర్యాదు కాపీని కూడా అందజేస్తారు.

April 5, 2026 / 12:05 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలి’

BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరాతీశారు. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాలన్నారు.

April 5, 2026 / 12:02 PM IST

‘రోడ్డు సమస్యను ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు వినతి’

ADB: బజార్ హత్నూర్ మండలంలోని మోర్ఖండి గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన సమస్య అయిన బరంపూర్ మోర్ఖండి రోడ్డు అటవీ అనుమతులపై ప్రస్తావించాలని అనిల్ జాదవ్‌ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

April 5, 2026 / 12:00 PM IST

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SRCL: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తమ ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. బీజేపీ స్థాపన నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయత పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

April 5, 2026 / 11:55 AM IST

చంద్రగిరిలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

SRCL: వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 11:51 AM IST

జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన నాయకులు

MNCL: బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసిన మహనీయుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 11:49 AM IST

కాశీ,అయోధ్య బస్సు ప్రారంభించిన డిపో మేనేజర్

NRML: ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో కాశీ, అయోధ్య బస్సును డిపో మేనేజర్ పండరి నేడు ప్రారంభించారు. ఈ బస్సు మైహార్, ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, నైమి శారణ్య, ఉజ్జాయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రలకు వెళ్లి వస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల ఆదరణ తో అయోధ్యకు నాలుగో సారి సర్వీసును నడుపామని అన్నారు. ఈ యాత్ర అనంతరం గోవా, రామేశ్వరం టూర్ ఉంటుందని ఆయన తెలిపారు.

April 5, 2026 / 11:49 AM IST

VIDEO: నర్సంపేటలో ఘనంగా జగ్జీవన్ జయంతి

WGL: నర్సంపేటలో దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేఏసీ కన్వీనర్ డా. గద్ద వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయా సాధన కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 11:45 AM IST

జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన సీఎం

HYD: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అపారమైనవని, కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారన్నారు.

April 5, 2026 / 11:44 AM IST