BDK: అశ్వారావుపేట మండల నూతన తహశీల్దార్‌గా డి. కిషోర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందిస్తానని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన కిషోర్‌కు రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
MHBD: పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఏఎంసీ ఛైర్మన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం మార్కెట్ కమిటీ సభ్యులు సెలవు ప్రకటించారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ కార్యదర్శి సతీష్ కుమార్ సతీమణి అకాల మృతికి చింతిస్తూ మిర్చి శాఖ సభ్యుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. తిరిగి ఈనెల 8వ తేదీ బుధవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు సిద్దిపేట షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు వేధింపులకు గురైతే ఎటువంటి ఆందోళన చెందకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని అధికారులు సూచించారు. కార్యక్రమాల్లో భాగంగా ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, 100/1930 హెల్ప్ లైన్ నంబర్ల వాడకంపై అవగాహన కల్పించారు.
MDK: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై వినతులు అందజేశారు. స్పందించిన కలెక్టర్, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
SRD: వేసవిలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంటు సరఫరా చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ సుధీర్ కుమార్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయంకి త్రీఫేస్ కరెంట్ సాయంత్రం 4 గంటలకి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని రాత్రి 7 గంటల వరకు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ASF: సిర్పూర్ టౌన్ మండలంలో CITU ఆధ్వర్యంలో కార్మికోద్యమ నాయకులు బీటీ రణదివే 36వ వర్ధంతి సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు, నాయకులు నివాళులర్పించారు. CITU జిల్లా సహా కార్యదర్శి క్రిష్ణమాచారి మాట్లాడుతూ.. రణదివే భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనేత అని, కార్మిక హక్కుల కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
NLG: మాటూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఎన్సీడీ స్క్రీనింగ్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ జిన్నే సిద్దులు ప్రారంభించారు. ఏళ్ల తరబడి వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డ గ్రామస్తుల కోసం ఈ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ధ్యేయమన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు.
MNCL: జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మొదటి వార్డులో ఈజీఎస్ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల పనులను సోమవారం గ్రామ సర్పంచ్ ఫయాజుద్దీన్ ప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రోత్సాహంతో గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు.
జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు బండారి రాజయ్యకు వికలాంగుల కోటా కింద త్రి చక్రాల వాహనం మంజూరయ్యింది. సోమవారం వెల్గటూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్ధిదారునికి వాహనం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, కాంగ్రెస్ ఉమ్మడి వెల్గటూరు నేతలు పాల్గొన్నారు.
MBNR: కోర్టుకు వచ్చే ప్రజల దాహార్థిని తీర్చేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
JN: లింగాల గణపురంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరేందుకు యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నేతలు పాల్గొన్నారు.
MNCL: జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై పక్కనే ఉన్న పెగడపల్లి వాసులు సోమవారం నిజామాబాద్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. గాలి, ధ్వని కాలుష్యం వల్ల పిల్లలకు, వృద్ధులకు శ్వాస కోశ, చర్మ వ్యాధులు, ప్రజలకు తీవ్ర వింత అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దుమ్ము, ధూళి, పొగ వల్ల పంట నష్టాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.
ASF: కాగజ్ నగర్‌లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మాజీ MLA కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ సోమవారం కొనసాగింది. ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి రోజురోజుకు మంచి స్పందన లభిస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న సిమ్మింగ్ పూల్ దగ్గర కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.