• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్కలదేవిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం..!

SRPT: సూర్యాపేట-ఖమ్మం హైవేపై మోతే మండలం అక్కలదేవిగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లను కారు ఢీకొనడంతో డ్రైవర్ గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. కారులోని వారు ఎయిర్ బ్యాగుల వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.ఇక్కడ అండర్ పాస్ లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

April 7, 2026 / 08:14 AM IST

నాగారంలో గ్రామ దేవతల ప్రతిష్ట ఉత్సవాలు

PDPL: కమాన్పూర్ మండలం నాగారంలో గ్రామ దేవతల ప్రతిష్ట కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. పుణ్యవచనం, అగ్ని ప్రతిష్ట, దేవతల ఊరేగింపు, కలశ స్థాపన నిర్వహించారు. ఈ వేడుకలు గురువారం వరకు జరుగుతాయని గ్రామస్తులు వెల్లడించారు. మంగళవారం కుంకుమ పూజ, బుధవారం విగ్రహ ప్రతిష్టాపన, గురువారం బలి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

April 7, 2026 / 08:11 AM IST

ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లు: కలెక్టర్

VKB: ట్రాన్స్ జెండర్లకు సామాజిక, ఆర్థిక గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్ లో అర్హులైన ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని కలెక్టర్ వివరించారు.

April 7, 2026 / 08:11 AM IST

వనపర్తిలో కారు ప్రమాదం.. తృటిలో ప్రమాదం తప్పింది

WNP: వనపర్తి పట్టణంలోని పెబ్బేరు రోడ్డులో తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. దొడిగుంటపల్లికి చెందిన కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

April 7, 2026 / 08:06 AM IST

మే 22 వరకు మ్యాచ్.. ఉప్పల్లో యథాతథం

MDCL: ఉప్పల్లో ఏప్రిల్ 5న IPL మ్యాచ్ SRH VS LSG మధ్య జరిగింది. ఈ IPL సీజన్ ఉప్పల్ స్టేడియంలో మే 22వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన ఏర్పాటులను యధావిధిగా ఉంచినట్లుగా తెలిపారు. మళ్లీ పని భారం పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు.

April 7, 2026 / 08:05 AM IST

జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తా: CM

ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. రజాకార్లను ఎదిరించిన ఘనత జిల్లా ప్రజలకే దక్కుతుందని CM రేవంత్ రెడ్డి అన్నారు. బజార్హత్నూర్‌లోని పిప్పిరిలో సోమవారం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం జూన్ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

April 7, 2026 / 08:04 AM IST

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్

NRPT: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉచ్చాహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇసుక రవాణా “మన ఇసుక మన వాహనం” ఆన్‌లైన్ పద్ధతిలోనే జరగాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ వినీత్, సీఐ, ఎస్సై, తహశీల్దార్, ఎంపీడీవో, మైనింగ్ అధికారులు, పాల్గొన్నారు.

April 7, 2026 / 08:03 AM IST

ఇంటింటికి సీపీఐ కార్యక్రమం

JGL: కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసిన ఘనత సీపీఐదే అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చెన్నవిశ్వనాధం అన్నారు. కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్మికుల ప్రక్షాళన నిలబడి బీడీ కార్మికులకు కనీస వేతనాలు, జీవన మృతి సాధించామన్నారు. సీపీఐ ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించామన్నారు.

April 7, 2026 / 08:03 AM IST

అక్రమ మొరం తవ్వకాలపై కఠిన చర్యలు: కలెక్టర్

NZB: నిజామాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా మొరం, ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి మూడు టిప్పర్లు, రెండు జెసిబీలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

April 7, 2026 / 08:03 AM IST

HYDలో భూమిలోనే కరెంట్ తీగలు.. పనులు షురూ!

HYDలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబులింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బొటానికల్ గార్డెన్ కొండాపూర్ ప్రాంతంలో మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టారు. కరెంట్ స్తంభాలపైన ఉండే విద్యుత్ తీగల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా, ప్రభుత్వం ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. త్వరలో HYD నగరం మొత్తం కరెంటు తీగలు భూమిలోనే వేయనున్నారు.

April 7, 2026 / 08:03 AM IST

దేవస్థానం అభివృద్ధికి విరాళం

SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయం అభివృద్ధిలో భాగంగా భక్తులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన జొన్నగాని రాజేష్ గౌడ్-సరిత దంపతులు, వారి తండ్రి జొన్నగాని యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి, స్వామివారి ఆలయ అభివృద్ధి నిధికి రూ.1,00,000 విరాళంగా సమర్పించారు.

April 7, 2026 / 08:03 AM IST

మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉందా..?

KMR: కామారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లోని 25వ గదిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ఈ సెల్ పని చేస్తుంది. ప్రజలు తమ నీటి సమస్యలపై ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9908712421 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

April 7, 2026 / 08:02 AM IST

ఆరోగ్య అవగాహన ర్యాలీ..పౌష్టికాహారం ప్రోత్సాహం

NRPT:  పట్టణంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలనే అవగాహన కల్పించేందుకు DMHO జయ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సోమవారం జరిగిన ‘ఈట్ రైట్ వాక్ థాన్’లో ప్రధాన రహదారుల గుండా నడిచి, పౌష్టికాహారం, ఆరోగ్య సూత్రాలపై ప్రజలకు అవగహణ కల్పించారు. కొత్త ఆహార వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారికి లైసెన్స్‌లు అందజేశారు.

April 7, 2026 / 08:02 AM IST

‘నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గును’

NRML: పంటలు చేతికి వచ్చాక మిగిలిన పంట అవశేషాలకు నిప్పు పెట్టకుండా అలానే వదిలేయాలని కుబీర్ AO సారిక ఓ ప్రకటనలో సూచించారు. అవశేషాలకు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదాలు సంభవించి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పంట అవశేషాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గుతుందని, అలానే వదిలేస్తే వర్షాలు కురిసిన వెంటనే సహజ ఎరువులుగా మారి పంటలకు బలాన్ని అందిస్తాయన్నారు.

April 7, 2026 / 08:02 AM IST

రైతులకు చేదువార్త.. యాసంగి సాగుకు నిలిచిన మూసీ నీరు

NLG: యాసంగి సీజన్ ముగియడంతో మూసీ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదలను అధికారికంగా నిలిపివేశారు. గత డిసెంబర్ నుంచి సుమారు 100 రోజుల పాటు నిరంతరాయంగా సాగునీటిని అందించడంతో పంటలు చేతికి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి సరఫరాను పూర్తిగా బంద్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

April 7, 2026 / 08:00 AM IST