• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

’21వ డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి’

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఊరగుట్ట ప్రాంతంలో ఆయన పర్యటించారు. సందర్భంగా స్థానికులు ఆయన దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారు. రాబోయే రెండు మూడు రోజుల్లో నీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానన్నారు.

April 5, 2026 / 01:18 PM IST

బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మహానేత, సామాజిక న్యాయ పోరాట యోధుడు ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా, విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:17 PM IST

రేపు అశ్వాపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

BDK: అశ్వాపురం మండలంలో రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేడు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 10:30 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.

April 5, 2026 / 01:15 PM IST

ఘనంగా డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

NZB: ఆర్మూర్ పట్టణంలో బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత బాంధవుడు సమతావాది, సంఘసంస్కర్త, దేశ మాజీ ప్రధాని చేసిన వ్యక్తిని అన్నారు.

April 5, 2026 / 01:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వ విప్‌ను సన్మానించిన కంది శ్రీనివాసరెడ్డి

ADB: రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ఆదివారం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈనెల 6న భజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించనున్న CM పర్యటన ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

April 5, 2026 / 01:15 PM IST

పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం

SRD: జిల్లా స్థాయి పోలీస్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. క్రీడలు పోలీసుల మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.హోంగార్డుల నుంచి అధికారుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో ఆడే అవకాశం కల్పిస్తామని ఎస్పీ వెల్లడించారు.

April 5, 2026 / 01:12 PM IST

ఈ నెల 8న చెరువుగట్టు ఆలయ టెండర్ల వేలం

NLG: చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివిధ టెండర్ల బహిరంగ వేలం ఈనెల 8న బుధవారం జరగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గట్టుపై ఉన్న ఈవో కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 వరకు వర్తించే ఈ వేలం ప్రక్రియలో ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆలయ ఈవో మోహన్ తెలిపారు.

April 5, 2026 / 01:12 PM IST

‘మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషి’

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆమె ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:11 PM IST

జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

MDCL: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా బాలానగర్‌లోని చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బాలానగర్ మాజీ కార్పొరేటర్ శ్రీ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:11 PM IST

KUలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి నియామకం ఆలస్యం

HNK: కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి నియామకం సీనియారిటీ వివాదంతో ఆలస్యమవుతోంది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సంకినేని వెంకటయ్య పదవీకాలం ముగియగా, డా. గడ్డం కృష్ణయ్య, డా. లలిత కుమారి ఇద్దరూ తామే సీనియర్ అని వాదిస్తునట్లు సమాచారం. వీసీ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కమిటీని ఏర్పాటు చేశారు.

April 5, 2026 / 01:10 PM IST

‘జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి’

VKB: దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సుధాకర్ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం కాలనీలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

April 5, 2026 / 01:09 PM IST

రేషన్ బియ్యం పంపిణీ పరిశీలన

‌KNR: కరీంనగర్‌లోని 23వ డివిజన్ సీతారాంపూర్‌లో జరుగుతున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (HRCCI) రాష్ట్ర కార్యదర్శి పాదం అజంత పటేల్ ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మూడు నెలల కోటా బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న తీరును ఆమె క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.

April 5, 2026 / 01:07 PM IST

‘సింగరేణి బకాయిలను వెంటనే విడుదల చేయాలి’

PDPL: సింగరేణి జీడీకే –1 గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో రామగుండంలో, నిర్వహించిన గేట్ మీటింగ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు లేక కార్మికుల వేతనాలు, నాసిరకం మెటీరియల్తో భద్రత సమస్యలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు.

April 5, 2026 / 01:05 PM IST

‘బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం అందరికి స్ఫూర్తిదాయకం’

MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్ రామ్‌ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం సాగించిన పోరాటం అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వైస్ ఛైర్మన్ సత్యనారాయణ, కమిషనర్, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:05 PM IST

ఘనంగా డా.బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు

MHBD: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా TDP పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుతారపు వెంకటనారాయణ, ప్రేమ్ చంద్, బోమ్మవెంకటేశ్వర్లు ఉన్నారు.

April 5, 2026 / 01:04 PM IST