• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీఎంను కలిసిన వేం నరేందర్

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూలబొకే అందజేసి తన నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం సైతం వేం నరేందర్‌కు అభినందనలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సీఎం ఆయనకు సూచించారు.

March 10, 2026 / 02:21 PM IST

రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

WGL: నగరంలోని 48, 49 డివిజన్‌లలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

March 10, 2026 / 02:20 PM IST

‘మహిళల విద్యకు పునాది వేసింది సావిత్రిబాయి’

BDK: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి అర్పించారు. మహిళల విద్యకు పునాది వేసిన మహనీయురాలు అని కొనియాడారు.

March 10, 2026 / 02:20 PM IST

హైదరాబాద్‌కు తరలిన తెలంగాణ ఉద్యమకారులు

PDPL: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిర్వహించే తెలంగాణ ఉద్యమ మిలియన్ మార్చ్ కోసం జిల్లా కేంద్రం నుంచి ఉద్యమకారులు భారీగా తరలివెళ్లారు. జిల్లా అమరవీరుల స్తూపం వద్ద ఫోరం జిల్లా అధ్యక్షుడు ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక బస్సులో బయలుదేరిన ఈ బృందంలో నాయకులు చంద్రకళ, రాజేశం తదితరులు ఉన్నారు.

March 10, 2026 / 02:20 PM IST

మిడ్జిల్‌లో పశువులకు గాలికుంటు టీకాలు

MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి, వేముల, వాడ్యాల, అయ్యవారిపల్లి గ్రామాల్లో మంగళవారం పాడి పశువులు, దూడలకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి, దుక్కి దున్నే జీవాలకు టీకాలు అందించారు. కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

March 10, 2026 / 02:18 PM IST

రేపు రామగుండంలో 11వ వార్షిక యాగ మహోత్సవాలు

PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిర్డి సాయినాథుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా రేపు వార్షిక యాగ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ తెలిపారు. 11న దేవత స్థాపన, 12న 108 మంది పుణ్య దంపతులచే ఆంజనేయ స్వామి మహాయాగం మహోత్సవం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 10, 2026 / 02:17 PM IST

ప్రణాళిక బద్దంగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్

MDK: జిల్లాలో ప్రణాళిక బద్ధంగా ఆయిల్ ఫామ్ తోటలలో మొక్కల ప్లాంటేషన్ చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. అనంతరం ఆయన చేగుంట మండలం వడియారంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమం పరిశీలించారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు, డ్రిప్‌కు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏవో హరి ప్రసాద్, HO సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

March 10, 2026 / 02:15 PM IST

“స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి”

BHPL: మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్‌లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.

March 10, 2026 / 02:15 PM IST

బాబోయ్ వేడి.. స్విమ్మింగ్ పూల్స్‌కు పరుగులు

VKB: వేసవి కాలం మొదవగానే నగరంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతల నుంచి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు, యువకులు స్విమ్మింగ్ పూల్స్‌కు పరుగులు తీస్తున్నారు.

March 10, 2026 / 02:15 PM IST

మంత్రులను కలిసిన ఝాన్సీరెడ్డి

JN: తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖలను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆమె మంత్రులను కోరారు.

March 10, 2026 / 02:15 PM IST

పోరాటం ఫలించింది.. ముగిసిన ఆందోళన

MDCL: బాచుపల్లి మండల పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల పోరాటం ఫలించింది. సర్వే నంబర్ 186లో హిందూ స్మశాన వాటిక కోసం 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ​ఇటీవల ఓ బాలిక మృతి చెందగా, దహన సంస్కారాలకు స్థలం లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

March 10, 2026 / 02:14 PM IST

ఆరుట్ల మోడల్ స్కూల్‌ను సందర్శించిన AISF బృందం

RR: మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మోడల్‌గా నిర్మిస్తూ అభివృద్ధి చేసిన తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్‌ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బృందం తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.

March 10, 2026 / 02:14 PM IST

ఘనంగా విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్

SRD: నారాయణఖేడ్ మండలం అబ్బెoద గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద నుంచి వివిధ రకాల్లో వంటకాలు తీసుకొచ్చారు. పాఠశాల వరండాలో ఫుడ్ ఫెస్టివల్ చేపట్టగా, స్థానిక హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థుల 62 వంటకాల వంటకాల రుచి చూశారు. విద్యార్థులు ఆనందంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు.

March 10, 2026 / 02:13 PM IST

‘యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి’

ADB: యువత ప్రభుత్వంతోపాటు ప్రవేటు రంగ సంస్థలు కల్పించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో SP అఖిల్ మహాజన్‌తో సమావేశమై మాట్లాడారు. జాబ్ మేళాకు యువత తరలిరావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

March 10, 2026 / 02:12 PM IST

‘జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షకు 98 శాతం హాజరు’

PDPL: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 98 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4829 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 4735 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 94 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.

March 10, 2026 / 02:10 PM IST