• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల కమిటీ ఎన్నిక

SRPT: తుంగతుర్తిలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉపేందర్, కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా కేదారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా సోమయ్య, సంజీవ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యవర్గం సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్నారు.

February 26, 2026 / 04:04 PM IST

పట్టణ సమస్యలు పరిష్కరించాలని వినతి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అనిత, BRS కౌన్సిలర్లు కలిసి జాయింట్ కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లోపాలు, తాగునీటి సరఫరా అంశాలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హమీ ఇచ్చారు.

February 26, 2026 / 04:02 PM IST

కౌన్సిలర్లుగా ఐదుగురు ప్రమాణస్వీకారం

KNR: హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. అధికారుల సమక్షంలో సుమలత (10 వార్డు), అనూష (20 వార్డు),పంజాల మనోజ్ గౌడ్ (21 వార్డు), హరిదాసు లక్ష్మి దుర్గ (23 వార్డు), ప్రశాంతి (25 వార్డు) ప్రమాణస్వీకారం చేశారు. వీరిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, వైస్ ఛైర్ పర్సన్ అంజలి అభినందించారు.

February 26, 2026 / 04:02 PM IST

‘జిల్లాను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం’

ADB: జిల్లాలోని హట్టిఘాట్ పంప్ హౌస్, చనాకా-కోరాట బ్యారేజ్ ప్రాంతాల వద్ద ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

February 26, 2026 / 04:02 PM IST

దొరేపల్లి రైతుల సమావేశం

NRPT: మద్దూరు మండలం దొరేపల్లి గ్రామంలోని దామ్లా నాయక్ తాండ గ్రామపంచాయితీలో భూసంపత్తి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అధికారులు నిర్వహించిన సమావేశంలో రైతులకు పంటలో అధిక దిగుబడి కోసం పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

February 26, 2026 / 03:59 PM IST

గంగన్పల్లి పాఠశాలకు భోజన సామాగ్రి విరాళం

GDWL: కేటిదొడ్డి మండలం గంగన్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు గ్రామస్థుడు జనార్దన్ రెడ్డి 200 స్టీల్ భోజన ప్లేట్లు విరాళంగా అందించారు. సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ప్లేట్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పిల్లల సంక్షేమానికి, గ్రామ అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తుందని గ్రామస్తులు అభినందించారు.

February 26, 2026 / 03:55 PM IST

‘ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి’

MBNR: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో విలేజ్ హిస్టరీ షీట్స్ అప్డేట్ చేయాలన్నారు. చట్టాల ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 03:53 PM IST

ఇంటర్ సెకండ్ ఈయర్ పరీక్షల్లో 98.03% హాజరు

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలకు 15,515 మందికి 15,209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. 98.03% హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. రెండో రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు చెప్పారు.

February 26, 2026 / 03:52 PM IST

‘వనపర్తి-మంత్రాలయంకు 4 లైన్ల రహదారి’

WNP: వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, రాయచూర్, మంత్రాలయం వరకు నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన ఆత్మకూరులో మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయించామన్నారు. రూ.400 కోట్లతో ఆత్మకూరులో శాంతిని సుందరీకరణ చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 03:50 PM IST

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాన కార్యదర్శి

MBNR: కార్పొరేషన్ పరిధిలోని పాత పాలమూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాతూరు కుమార్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం వారి నివాసానికి చేరుకుని వారిని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

February 26, 2026 / 03:48 PM IST

బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గం

NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ మతపెద్దల ఆశీర్వాదంతో మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిసేసి, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

February 26, 2026 / 03:46 PM IST

శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు జెన్కో ఎస్ఈ వి.జగదీశ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 500 క్యూసెక్కులతో మొదలై, 2 గంటల వరకు ప్రవాహం 2,000 క్యూసెక్కులకు పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి నదిలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 03:44 PM IST

ఇంటి వద్దకే రామచంద్రస్వామి తలంబ్రాలు

SRD: ఇంటి వద్దకే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తలంబ్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. www.tgslogistics.co.in, ఆర్థిక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ల వద్ద రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 03:43 PM IST

చిట్యాలలో వేముల విపుల్ జన్మదిన వేడుకలు

NLG: కాంగ్రెస్ యువజన నాయకుడు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ జన్మదిన వేడుకలను చిట్యాల కూడలిలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ ఛైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన సైదులు, దేశపాక రాజేష్, కృష్ణ కొసనం అశోక్ పాల్గొన్నారు.

February 26, 2026 / 03:40 PM IST

ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ.. రాజ్యసభ సీట్లపై చర్చ !

SRD: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

February 26, 2026 / 03:40 PM IST