• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హన్వాడ పోస్ట్ ఆఫీసులో సమావేశం

MBNR: హన్వాడ పోస్ట్ ఆఫీసులో జిల్లా పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో సమావేశమయ్యారు. సేవింగ్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి, బీమా వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసి అందరూ వినియోగించుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పోస్టుమాస్టర్ చంద్రశేఖర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

February 24, 2026 / 09:31 AM IST

‘ప్రధాన రహదారిని వెంటనే విస్తరించాలి’

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో రహదారి వేయడానికి వీలుకావడం లేదు. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జన్నారం శివారులోని జింకల పార్కు నుండి రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

February 24, 2026 / 09:31 AM IST

‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి’

RR: చేవెళ్ల మండలంలో భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్ అన్నారు. మండలంలో మొత్తం రైతులు 32,650ల మంది ఫార్మర్ రిజిస్టేషన్‌కు అర్హులుగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని గుర్తించాలని సూచించారు.

February 24, 2026 / 09:31 AM IST

అభ్యుదయ కవి కొండ లింగారావుకు సాహితీ పురస్కారం

SRPT: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన అభ్యుదయ కవి కొండ లింగారావుకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో. నిర్వాహకులు ఆయనను సార్ తో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు. విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో ఆయన టాప్ 20 విజేతగా నిలిచారు.

February 24, 2026 / 09:30 AM IST

రైతులను నిండా ముంచిన అకాల వర్షం

ఖమ్మం జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. గ్రామాల్లో ఈసారి అధిక మొత్తంలో సాగు చేసిన మొక్కజొన్న మరో నెలలో చేతికి రానున్న తరుణంలో అకాల వర్షం రైతులను పూర్తిగా నష్టపరిచింది.

February 24, 2026 / 09:28 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

SRCL: మండలంలోని నామాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన చందు(21) అనే యువకుడు గూడెం గ్రామం నుండి ఆవునూర్ వైపు పయణిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ చందును సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్ఎచ్‌వో తెలిపారు. 

February 24, 2026 / 09:26 AM IST

బతుకమ్మ తల్లి కూతురి విగ్రహం ధ్వంసం

WGL: పర్వతగిరి మండలం, దౌలత్ నగర్ గ్రామంలో చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి,కూతురి విగ్రహంలోని చేతులను కొందరు రాత్రి మద్యం సేవించి దుండగులు ధ్వంసం చేశారు మంగళవారం స్థానికులు తెలిపారు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 09:24 AM IST

వెబ్ సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు

SRD: ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు.

February 24, 2026 / 09:23 AM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

VKB: పెద్దేముల్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకు 3 ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 09:22 AM IST

ఈ నెల 26 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

NZB: టి యు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రెటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చ్ 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28, మార్చ్ 2, 4, 6, 9, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.

February 24, 2026 / 09:22 AM IST

భారీ వర్షం నీటమునిగిన రాజేంద్రనగర్, బుద్వేల్

HYD: రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్ బుద్వేల్ రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం, పొరపాట్ల కారణంగా గుంతలతో నిండిపోయాయని ప్రజలు వాపోతున్నారు. స్థానికులు, విద్యార్థులు, ప్రయాణికులు వర్షాల వేళ రోడ్డు జాగ్రత్తగా దాటాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షానంతరం ట్రాఫిక్ నియంత్రణకు సవాలు సృష్టిస్తోంది.

February 24, 2026 / 09:22 AM IST

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం

JGL: గొల్లపల్లి మండలం బీబీ రాజు పల్లె గ్రామంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడడంతో లంబడిపల్లెకు చెందిన డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

February 24, 2026 / 09:18 AM IST

హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతి

WNP: హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 09:17 AM IST

‘మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం’

ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె. హరిత చెప్పారు. కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, అటవీ అధికారులు, BSNL , ఎయిర్ టెల్, జియో, టీ ఫైబర్ ప్రతినిధులతో సెల్ టవర్ నిర్మాణాలు, ఇంటర్నెట్ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని అనుమతులు, స్థలాల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

February 24, 2026 / 09:17 AM IST

కో -ఆప్షన్ పదవుల కోసం ఆశావహుల ఆశలు

KMR: కామారెడ్డి మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కో -ఆప్షన్ పదవులపై పడింది. ప్రస్తుతం ఈ ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం కొత్త పాలకవర్గం కొలువదీరిన వెంటనే కో-ఆప్షన్ పదవులను నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేసన్ జారీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.

February 24, 2026 / 09:16 AM IST