SRPT: నడిగూడెం మండల పరిధిలోని కరివిరాల గ్రామ పంచాయతీలో పొదుపు మహిళా బృంద సమావేశ మందిర (VO బిల్డింగ్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ మరోజు పార్వతమ్మ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, వారి సమావేశాల నిర్వహణకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందన్నారు.
JGL: జగిత్యాల మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్ సమిండ్ల వాణిపై అభిమానాన్ని ఓ వడ్రంగి వినూత్నంగా చాటుకున్నారు. సంగంపల్లికి చెందిన గుగ్గిళ్ల వెంకటేశ్ రెండు రోజుల పాటు శ్రమించి, టేకు కర్రపై ఆమె పేరును అందంగా చెక్కారు. గురువారం ఆ ప్రత్యేక నేమ్ ప్లేట్‌ను ఛైర్ పర్సన్‌ను బహూకరించారు. వృత్తిపై మక్కువతో ఆయన చేసిన ఈ పనిని సమిండ్ల వాణి అభినందించారు.
WGL: నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఇవాళ కౌన్సిలర్లతో కలిసి పట్టణంలోని పలు వార్డులను పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వేసవి కాలంలో పట్టణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా నూతన బోర్లు వేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
SDPT: కోహెడ మండలం సీసీ పల్లెలో బెజ్జంకి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవల వినియోగం, పొదుపు ప్రాముఖ్యత, బీమా పథకాల వివరాలు ప్రజలకు తెలియజేశారు. కేవైసీ అప్‌డేట్ అవసరాన్ని వివరించి, సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ మోహన్, సర్పంచ్ సంపత్ పాల్గొన్నారు.
SRD: కంగ్టి మండలంలోని రైతులు పీఎం కిసాన్ పథకాన్ని లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఏవో హరీష్ పవార్ అన్నారు. 22వ విడత పీఎం కిసాన్ పథకానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ క్లస్టర్ పరిధిలో ఏఈవోల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
MNCL: జన్నారంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షను 4 విద్యార్థులు రాయలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 142 మంది విద్యార్థులకు గాను 138 మంది పరీక్ష రాశారు. నలుగురు పరీక్ష రాయలేదు. దండేపల్లి జూనియర్ కళాశాలలో 155 మంది విద్యార్థులకు గాను 153 మంది పరీక్ష రాయగా, ఇద్దరు రాయలేదు. లక్షెటిపేట కళాశాలలో 211 మంది విద్యార్థులకు గాను నలుగురు పరీక్ష రాయలేదు.
NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, మైనారిటీ, క్రిస్టియన్ మత పెద్దల ఆశీర్వాదంతో భాధ్యతలు స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర కుమార్, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేష్ గారు బాధ్యతల స్వీకారం చేశారు.
NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో షీటీం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ వివాదాలతో బాధపడుతున్న వారికి షీటీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి విడిపోయిన వారిని మళ్లీ కలిపారు. నిర్మల్ వరకు వెళ్లాల్సిన భారం లేకుండా భైంసాలోనే సౌకర్యం కల్పించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
KNR: గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో ప్రజా ప్రతినిధుల బాధ్యతాయుతమైన సామాజిక సేవ అభినందనీయమని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆకయన సమక్షంలో వార్డు సభ్యులు ఆడెపు రాజు (అంబులెన్స్), తాడేపల్లి శ్రీనివాస్ (బాడీ ఫ్రీజర్), ఉపసర్పంచ్ ఐలయ్య (వైకుంఠ రథం) పంచాయతీకి విరాళంగా అందజేశారు. దీంతో వారిని MLA అభినందించారు.
VKB: కుల్కచర్లలో ఇంటర్మీడియట్ పరీక్షల రెండవ రోజు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల పరిశీలకులు తెలిపారు. రామలింగేశ్వర డిగ్రీ కాలేజీలో 186 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపల్ కామేశ్వరి వెల్లడించారు. వివేకానంద జూనియర్ కాలేజీలో 206 మందికి గాను 199 మంది హాజరు కాగా, 7మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.
MDK: హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తిమ్మాయిపల్లికి చెందిన మమత, ఆర్యాన్, పరమేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రెండు నెలల పసికందు మరణానికి కారణమైన శ్రీధర్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి అనే నిందితులందరిపై మర్డర్ కేసు నమోదు చేయాలని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పసిపాపను చంపిన కులోన్మాదులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
WNP: ఆత్మకూరు పట్టణంలో గురువారం వాసవి కాలనీలో నూతనంగా నిర్మించిన వాసవి కళ్యాణ మండపాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైశ్య సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన కళ్యాణ మండపం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
NZB: జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన భూలోక విజయ్ కాంత్ రావు ఇవాళ మర్యాద పూర్వకంగా జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను కలిశారు. DYSO మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సైక్లింగ్ క్రీడ అభివృద్ధి చేయాలని క్రీడ సంస్థ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
BHNG: మోత్కూర్-గుండాల ప్రధాన రహదారిలోని బిక్కేరు వాగుపై నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన సింగిల్ లైన్ బ్రిడ్జితో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా ఈ పాత వంతెనపై తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.