KTR: లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని అన్నారు. ఓటమి విజయానికి కారణం. పరాజయంతో ధైర్యంగా ముందుకు పోవాలని సూచించారు. పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జ్లని తెలిపారు. వీళ్లే నియోజకవర్గాల్లో అధికంగా పర్యటించాలని కేటీఆర్ తెలిపారు.
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం సందర్భంగా పరాజయం పాలైన బీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. తర్వాత చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తనని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామని రంజిత్ రెడ్డి తెలిపారు.