MLC Kavitha : లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 9న విచారణకు రావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లేఖ పంపారు. గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 14 వరకు పలు కార్యక్రమాలు ఉన్నాయని.. 15న హాజరవుతానని కోరారు.
10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు కవిత. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 9న విచారణకు రావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లేఖ పంపారు. గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 14 వరకు పలు కార్యక్రమాలు ఉన్నాయని.. 15న హాజరవుతానని కోరారు.
10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు కవిత. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాగా… దీనికి ముందు…ఈడీ నోటీసులపై బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు కవిత. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని తెలుసుకోవాలని మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు కవిత. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని.. ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు.