మెడికల్ (Medical) విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస చెప్పింది. వారి నెలవారీ స్టైపెండ్(Stipend)ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్ల(House Surgeons)తో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్‌ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఆర్డర్ జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు .ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి వివిధ బోధనాస్పత్రుల్లో హౌజ్‌సర్జన్(House surgeon),డెంటల్ హౌజ్సర్జన్లుగా పనిచేస్తున్న వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.22,527 ఇస్తుండగా, దాన్ని రూ.25,906కు పెంచారు. ఇక పీజీ ఫస్టియర్ విద్యార్థులకు 50,385 నుంచి 58,289, సెకండియర్ విద్యార్థులకు 53,503 నుంచి 61,528, థర్డ్ ఇయర్ విద్యార్థులకు 56,319 నుంచి 64,767కి స్టైపెండ్ పెరగనుంది. తమకు గౌరవ వేతనం పెంచడంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)కు కృతజ్ఞతలు తెలిపారు.