MHBD: గార్ల మండలంలో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులు తమ సమస్యలను వెల్లడించారు. మంగళవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో 98ను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే రైతులను కలిసి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.