GDWL: ఇటిక్యాల మండల తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు బొజ్జిరెడ్డి వెంకటరామమ్మ సోమవారం మరణించింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని మహిళలను చైతన్య పరచడంలో ఆమెది ప్రత్యేక శైలి. మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ వావిలాల సునీత వంటి నేతల గెలుపు కోసం గతంలో ఆమె అహర్నిశలు శ్రమించారు.