GDWL: తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమం గద్వాల జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ముగింపు రోజున ‘జీరో ఎన్ఫోర్స్మెంట్ డే’ నిర్వహించి, జరిమానాలు లేకుండా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.