PDPL: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీ హర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.