NGKL: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ యాదయ్య బుధవారం ప్రారంభించారు. ఈ యాత్ర నేటి నుంచి ఏప్రిల్ 3 వరకు కొనసాగనుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు సురక్షితంగా ప్రయాణించాలని, అందుబాటులో ఉన్న బస్సు సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.