SRPT: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారిని టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలు జరుగుతున్నాయని మోతే ఎస్సై అజయ్ కుమార్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో హెచ్చరించారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే గ్యాస్ బుకింగ్ మెసేజ్లు లేదా లింకులను క్లిక్ చేయవద్దని మండల ప్రజలకు సూచించారు. అధికారిక వెబ్ సైట్లు లేదా సంస్థలు సూచించిన ఫోన్ నంబర్లను మాత్రమే ఉపయోగించాలన్నారు.