GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలగపూడిలోని ఓ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 3 టూవీలర్లు రూ. 96,360 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణయపాలెంకి చెందిన ఆవాల శ్రీనివాస్ గత కొంతకాలంల ఫంక్షన్ హాల్లో పేకాట నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.