మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్లో ఎన్నికలకు ముందు పెండింగ్లో ఉన్నటువంటి పలు పనులను డివిజన్ కార్పొరేటర్ సరస్వతి మూస నరేందర్ ఆదివారం పరిశీలించారు. ఎస్సీ కాలనీలోని పెండింగ్లో ఉన్న పోచమ్మ దేవాలయాన్ని పరిశీలించి పనులను పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. డివిజన్ అభివృద్ధిలో భాగంగా ఈ కార్య క్రమాలను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.