AP: ఆవు, గేదె జాతి పశువులకు ఇవాళ్టి నుంచి వచ్చే నెల 29 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వెల్లడించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద తమ శాఖ సిబ్బంది పశు పోషకుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ టీకాలను ఉచితంగా అందజేస్తారని ప్రకటించారు. ఇందుకోసం 83.69 లక్షల డోసులను జిల్లాలకు సరఫరా చేశామని తెలిపారు.