NLG: గట్టుప్పల్ మండలం పలు గ్రామాల అంగన్వాడీ వర్కర్లను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఈ చర్యలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా బయలుదేరిన తమను అరెస్టు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.