JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం విద్యార్థులకు ఎస్ఓ మీనాక్షి హాల్ టికెట్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని స్వయంభు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించిన విద్యార్థులు ప్రత్యేక పూజలు చేశారు. పరీక్షలు అంటే భయం వీడి ధైర్యంగా పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలిపారు.