GDWL: ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామానికి చెందిన రెడ్డిపోగు నాగన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి రూ.11,500 ల ఆర్థిక సహాయం అందింది. మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు. ఆపద కాలంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో భరోసానిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.