RR: ప్లాట్ మధ్యలో స్తంభం ఏర్పాటు చేసిన ఘటన షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాలు మేరకు.. సువర్ణ అనే మహిళ తన ప్లాటు మధ్యలో విద్యుత్ అధికారులు స్తంభం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఫెన్సింగ్ ఉన్న పట్టించుకోకుండా స్తంభం వేయడంపై ఏఈకి ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే అక్కడి నుంచి స్తంభాన్ని తొలగించాలని కోరారు.