WNP: శ్రీ సరస్వతి కళాసమితి 45వ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు సాంస్కృతిక కార్యక్రమాలు రైతు భవనంలో దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లుగా కళలను కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న కళాసమితి సేవలు అభినందనీయమని అన్నారు.