MNCL: తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. దీంతో ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన వర్షిత ఇవాళ ఉరేసుకుని మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.