MHBD: జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ మహారాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. డోర్నకల్ మాజీ MLA డీఎస్ రెడ్యానాయక్ హాజరై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ పోరాట ప్రతిమ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రముఖ వైద్యులు డా. నెహ్రూనాయక్, BJP యువ నాయకురాలు ఇందుబారతి, స్థానిక ప్రముఖులు, తదితరులున్నారు.