SRCL:108 అంబులెన్స్, 102 అమ్మఒడి వాహనాలలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఉమ్మడి KNR 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ అన్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వారు అత్యవసర వాహనాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను తరలించే సమయంలో ప్రథమ చికిత్సకు అవసరమయ్యే మందులు ఉండాలన్నారు.