NZB: నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జెండాను మండల అధ్యక్షులు విడగొట్టు చిన్న ఒడ్డెన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.