జోగులాంబ గద్వాల జిల్లాలో ఉల్లాస్ (FLNAT) పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. DEO విజయలక్ష్మి మునగాల, నక్కలపల్లి కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. జిల్లాలోని 13 మండలాలు, 255 పంచాయతీలు మరియు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ పరీక్షకు 20,856 మంది మహిళలు హాజరయ్యారని ఆమె వెల్లడించారు. నిరక్షరాస్యత నిర్మూలనలో ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు.