HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న గౌడ సంఘం ఆలయ నిర్మాణ పనులను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందజేస్తానని, గౌడ కులస్తుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ వారికి అండగా ఉంటానన్నారు. పలువురు గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు.