NGKL: ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని నివారించేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు. పశువైద్యుడు రాజేశ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు తమ పశువులను తీసుకొచ్చి 278 పశువులకు వ్యాక్సినేషన్ టీకాలు వేయించారు.