జనగామ జిల్లా ముస్లిం డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు జమాల్ షరీఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని జామియా మసీద్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమాల్ షరీఫ్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సమాజంలో హిందూ–ముస్లింల ఐక్యతను పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, AMC శివరాజ్ యాదవ్, ఎస్సై భరత్, తదితరులు పాల్గొన్నారు.