MBNR: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై నూతనంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇదే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం ఉంది. రోడ్డుకు అడ్డంగా విగ్రహం ఉండడంతో.. మరో ప్రాంతానికి తరలించవలసిన పరిస్థితి ఏర్పడింది. అంగడి బజారులో పెట్టాలని దళిత సంఘాలు అంటుండగా.. తహసీల్దార్ కార్యాలయం ముందు విగ్రహం ఏర్పాటు చేయాలని మరికొందరు అంటున్నారు.