MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన ఏ. రాజేశ్వరికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంగళవారం మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రు. 2.50 లక్షల ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.