KNR: ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, 225 వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.