MNCL: జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ఆందోళనకు పెగడపల్లి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద సమావేశమై తీర్మానించారు. ఎస్టీపీపీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో శ్వాసకోశ, అలర్జీ వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరో ప్లాంట్ నిర్మాణంతో కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు.