BDK: వెంకటాపురం, చర్ల మండల పరిధిలోని ఎదిర గుట్టలు, యాకన్నగూడెం, సుబ్బంపేట ప్రాంతాల సరిహద్దుల్లో చిరుత సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో నేడు పరిశీలించారు. చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలు గుర్తించినట్లు వెల్లడించారు. చిరుత సమీప అటవీ ప్రాంతాల వైపు కదులుతున్నట్లు భావిస్తున్నామని అన్నారు.