MNCL: ప్రతి కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయాలని దండేపల్లి మండల తాహసీల్దార్ రోహిత్ సూచించారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంలోని తాహసీల్దార్ కార్యాలయంలో జనగణన సర్వే సూపర్వైజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో సూపర్వైజర్లు, ఎన్యూమటర్లు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి కుటుంబ సభ్యుని వివరాలను నమోదు చేయాలన్నారు.