ADB: గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందితే నేడు కాంగ్రెస్ పార్టీ గద్దనెక్కిన మూడు సంవత్సరాల కాలంలో రైతుల పరిస్థితి తలకిందులుగా మారి అగమ్యగోచరంగా తయారైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక మార్కెట్ యార్డును పరిశీలించి మాట్లాడారు.