SRPT: కర్ల రాజేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును బొల్లం మల్లయ్య యాదవ్, రాజేష్ తల్లి కర్ల లలితమ్మకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు.